సెలవుల్లో ‘మేము చదవడాన్ని
ఇష్టపడతాం’ కార్యక్రమం

*💥సెలవుల్లో ‘మేము చదవడాన్ని
*ఇష్టపడతాం’ కార్యక్రమం💥

*♦️మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహించాలన్న విధ్యాశాఖ

వేసవి సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. మే 1 నుంచి జూన్ పదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని సూచించింది.

ఉపాధ్యాయులు, అధికారులు భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యా యులు దత్తత తీసుకోవాలని, వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్ చేయాలని ఆదేశించింది.

💥ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది. తరగతుల వారీగా గ్రంథా లయ పుస్తకాలను విభజించి, ప్రదర్శించాలని వెల్లడించింది.

విద్యార్థులు చదివే సామర్థ్యం ఆధారంగా 5-10 పుస్తకాలను ఇవ్వాలని తెలిపింది. పుస్తకాలు చదవడం, కథలు రాయడంపై పోటీలను నిర్వహించనుంది.

1-5 తరగతుల విద్యార్థులు కథ చదువుతూ రికార్డు చేసి, పంపించాలి.

6-8 తరగతుల వారు స్వయంగా కథలు రాసి, పంపించాలి.

9-12 తరగతులు, డైట్ విద్యార్థులు రెండు కథలు రాసి, ఈ-మెయిల్ చేయాలి.

ఇంట్లో సొంతంగా గ్రంథాలయం నిర్వహణ, డ్రాయింగ్ పోటీలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

ఉపాధ్యాయు లకూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. కాగా, సమ్మెటివ్- 2 పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు.

2 thoughts on “సెలవుల్లో ‘మేము చదవడాన్ని<br> ఇష్టపడతాం’ కార్యక్రమం”

Leave a Comment