తెలుగు నీతి కధ
ఉల్లిపాయ- దేవుడు
ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి దేవాలయంకు వెళ్ళి దే వున్ని దర్శించుకుందాం అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది.
ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళాదుంపపై పడినది. బంగాళాదుంప చితికిపోయింది
.
అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే దేవాలయం చేరుకుంది. దేవుడిని చూస్తూ మైమరచి ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంత సేపటి తర్వాత దేవుడు ప్రత్యేక్షమై “ఓ ఉల్లిపాయ! లేవు నీ బాధకు కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు” అని అడిగాడు.
“పరమ తండ్రి నీకు ప్రణామములు” అని నమస్కరించింది. “నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నాకొరకు ఏడ్చేవారు, కన్నీరు కర్చేవారు లేరు తండ్రి ”.అని తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ.
అప్పుడు పరమ తండ్రి “ఓ! బిడ్డా నీవు బాధ పడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కరుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ.
English
The foolish thief
One day, a wealthy man came to Akbar’s court in hope to get help from Birbal. The man suspected that one of his servants had stolen from him.
The clever Birbal thought of a plan and gave all the merchant’s servants sticks of the same length. He also told them that the stick will grow three inches by tomorrow if they were the thief.
The next day, all the servants gathered around Birbal. He noticed that one of the servant’s sticks was three inches shorter than the others. Birbal immediately understood who the thief was.
The thief had cut the stick shorter by three inches as he thought it would grow three inches. Because of this his guilt was proven
Moral of the story
The truth will always come out one way or another so better to be truthful from the beginning.
Maths
సమాధానాలు మీ స్కూల్ whatsapp గ్రూప్ లో పెట్టండి