బుద్దిలేని స్నేహితుడు
ఒక అడవిలోని నది ఒడ్డున చెట్టు దగ్గర ఎలుక ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది. నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది.అలా కొన్ని రోజులకి అవి రెండు మంచి స్నేహితులయ్యాయి .
ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంట ని తినాలనుకుంటే ఎలుక కానీ, నదిని దాటి వెళ్లడానికి దానికి ఈత రాదు.
నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక. నువ్వు నువ్వు బరువు నా వీపు మీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరము మునిగిపోతాం. అని బదులిచ్చింది కప్ప.
కానీ ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకునే ఎలుక నీ కాలికి నా కాలికి, ఒక తాడు ని కడతాను. నువ్వు ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది వెనుక మిత్రుడి మాటను కాదనలేక కరీం అంది కప్ప.
ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకిన. అంతే ఎలుక బరువుగా ఉండటం తో అందులో మునిగి పోయే పరిస్థితి వచ్చింది.
అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది. కప్ప నీటిలోకి లాగింది. అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది.
ఎలక తో పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్నా తప్ప కూడా పైకి వచ్చింది. అది చూసిన కొంగ ఆహా ఏమి అదృష్టం అని సంబరపడింది.
ఎలుకని నది అవతల కి తీసుకొని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసి కూడా మొహమాటానికి పోయి పోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో దుఃఖించింది కప్ప